గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా సెలవు రావడంతో కాలేజీ నుంచి ఇంటికెళ్లిన ఓ బీటెక్ స్టూడెంట్ చనిపోయింది. పండుగ వేళ కుటుంబ సభ్యులతో పాటు పూజలో పాల్గొన్న ఆమె తేలు కాటుకు గురయ్యింది. దీంతో ఆస్పత్రికి తరలించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణ సమీపంలోని రగుడు గ్రామానికి చెందిన మాలతి బీటెక్ చదువుతోంది. మొన్న ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తుండగా ఆమెను తేలు కుట్టింది.
దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్ల టౌన్‌కి తీసుకెళ్లారు. అయితే.. విషం శరీరమంతా వ్యాపించడంతో అక్కడి డాక్టర్లు ఆమెను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ పొందుతున్న క్రమంలో మంగళవారం చనిపోయినట్టు సమాచారం.