Monday, November 25, 2024

అటవీ సంరక్షణకు పటిష్ట చర్యలు.. వర్క్‌షాప్‌ నిర్వహించిన అటవీశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అటవీ సంరక్షణ చట్టం1980 ఇటీవల సవరించబడిన నేపథ్యంలో ‘అటవీ సంరక్షణ, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ది కార్యక్రమాల మధ్య సమతూకాన్ని పాటించడం’ కోసం అటవీ జీవవైవిధ్య సంస్థ శుక్రవారం నాడు దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో వర్క్‌ షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా తెలంగాణ రాష్ట్ర అటవీదళాల అధిపతి ఆర్‌.ఎమ్‌. డోబ్రియాల్‌, బెంగళూరు ప్రాంతీయ కార్యాలయ అటవీ ఉప డైరెక్టర్‌ పి.సుబ్రహ్మణ్యం తదితరులు హాజరై మాట్లాడారు.

అటవీ సంరక్షణ చట్టం అమలులో తలెత్తే సమస్యల పరిష్కారాలకు, ఈ చట్టం పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి ఈ వర్క్‌ షాప్‌ ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి వర్క్‌ షాపులు సవరించబడిన అటవీ సంరక్షణ చట్టానికి నియమ నిబంధనలను రూపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ వర్క్‌ షాప్‌లో అటవీ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement