.. ఇక బుల్డోజర్ ట్రీట్మెంట్
.. అదనపు సైలెన్సర్లు ధ్వంసం
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి శబ్దం చేస్తే తాటతీస్తానని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆకస్మిక వాహనాల తనిఖీ చేపట్టి ద్విచక్ర వాహనాలకు నిబంధనలు ఉల్లంఘించి బిగించిన సైలెన్సర్లను ఊడదీయించి బుల్లోజర్లతో ధ్వంసం చేయించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… యువత ఇష్టానుసారంగా తమ ద్విచక్ర వాహనాలకు ఆదనపు సైలెన్సర్లు బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రోజురోజుకు సౌండ్ పొల్యూషన్ అధికమవుతుందని, ఇకపై తరచూ తనిఖీలు నిర్వహించి బుల్డోజర్ ట్రీట్ మెంట్ అందిస్తామని హెచ్చరించారు. వాహనదారులు శబ్ద కాలుష్యాన్ని సృష్టించే సైలెన్సర్లను వెంటనే తీసివేయాలని, లేకపోతే తమదైన స్టైల్ లో ట్రీట్ మెంట్ అందిస్తామన్నారు.