లాక్‌డౌన్‌ను హైదరాబాద్‌లో చాలా పటిష్టంగా అమలు చేస్తున్నామని నగర సీపీ అంజనీ కుమార్ అన్నారు. ప్రజలు బాగా సహకరిస్తున్నారని తెలిపారు. అయితే, ఈ పాస్‌లు చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని సీపీ వెల్లడించారు. అప్లై చేసిన వాళ్లే మళ్లీ మళ్లీ అప్లై చేయడంతో రిజెక్ట్ అవుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ పోలీస్ సిబ్బంది రక్త దానం చేస్తున్నారన్నారు. ఈ ఒక్క రోజు 2500కు పైగా కేసులు నమోదు చేశామని చెప్పారు. నకిలీ పాస్‌లు, జిరాక్స్ పాస్ కాపీలు, నకిలీ ప్రిస్క్రిప్షన్‌లు తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement