హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణను గుండుంబా, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పని చేయాలని ఆయన ఆదేశించారు.
బుధవారం వరంగల్లోని హరిత కాకతీయలో ఎక్సైజ్ , సాంస్కృతిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీపీఎల్, అక్రమ మద్యం, గంజాయి, గుడుంబా రవాణా, అమ్మకాలు, తయారు చేస్తున్నవారిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే పీడీ యాక్టు, బైండోవర్ కేసులను నమోదు చేయాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.