మల్హర్, (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లిలోని ఊర చెరువులో మత్స్యకారులు జూలై నెలలో చేప పిల్లలు చెరువులో వేయగా ఈరోజు ఉదయం చెరువు వద్దకు మత్స్యకారులు వెళ్ళేసరికి చేపలు 3 క్వింటాళ్ల చేపలు వింత వ్యాధితో మృతి చెందయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ఎలా వచ్చిందన్నది అంతుచిక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యశాఖ అధికారులు చేపలు ఎలామృతి చెందయన్నది వీటిపై దృష్టి సారించి చెరువులో ఉన్నచేపలకు మందులను పంపిణీ చేసి చేపలువ్యాధి సోకకుండా మత్స్యకారుల కుటుంబాలను కాపాడాలని రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, గ్రామాధ్యక్షులు సమ్మయ్య, నగేష్, శివసారయ్య, మహేందర్, లక్ష్మిస్వామి, గ్రామమత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital