వికారాబాద్, జనవరి 7 (ఆంధ్రప్రభ): ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులు ఎక్కడికక్కడ మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతున్నారు.
పరిగి నుండి వికారాబాద్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే దిగి మరో బస్ కోసం వేచి చూశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, బస్సులను బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఓవైపు రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతుండగా.. మరోవైపు బస్సులు మొరాయిస్తుండడం వల్ల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉన్నతాధికారులు స్పందించి మంచి బస్సులను వేయించాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -