టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. మహిళా సాధికారతపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై ఆమె మాట్లాడుతూ…మహిళలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా.. మహిళా సాధికారతపై నిజాలను దాచి చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలకు సూచించారు. దిగువ, మధ్య తరగతి మహిళలను నేరుగా ప్రభావితం చేస్తున్న ధరల పెరుగుదలను నియంత్రించడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. కరోనా నుంచి గ్రామాలను రక్షించడంలో అంగన్‌వాడీ సోదరీమణులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. అలాంటి అంగన్‌వాడీలకు 50 శాతం బడ్జెట్‌ను తగ్గించిన బీజేపీ ప్రభుత్వం.. తక్షణమే ఆ సోదరీమణులకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తల్లీబిడ్డల పోషకాహార స్థాయిని పెంచడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement