Tuesday, November 26, 2024

TG | సింగరేణి గనుల వేలం ఆపాలి.. కేంద్రానికి కోదండరామ్ అభ్యర్థన

సింగరేణి ఉత్తర తెలంగాణకు గుండెకాయ అని తెలంగాణ జన సమితి అధక్ష్కుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నేడు నాంపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు… ఉత్తర తెలంగాణలో సింగరేణి ద్వారా అనేక మంది జీవితాలు బాగు పడ్డాయని… దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

“1989 నుంచి చాలా పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు చేశారు, ఆ సమయంలోనే బొగ్గు గనులను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడం ప్రారంభం అయింది.. విద్యత్ ఉత్పత్తి చేసేవారికి గనులు అప్పజెప్పరు, ఈ క్రమంలోనే అక్రమాలు, అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి అని అన్నారు.

సుప్రీం కోర్టు ఈ కేటాయింపులను విశ్లేషించి… గనులను కేటాయించేటప్పుడు వేలం పద్దతిని పాటించి, ఎవరు బహిరంగ టెండర్ వేస్తే వారికే ఇవ్వాలని తీర్పు చెప్పిందని తెలిపారు. ఆ తీర్పు ప్రకారం బొగ్గు గనులను వేలం వేయడానికి అవకాశం కల్పించారు అని అన్నారు.

అది ప్రైవేటీకరణ వల్ల కలిగే అక్రమాలు, అవినీతిని నిలువరించేందుకు వచ్చిన చట్టం అని గుర్తు చేశారు. ఈ చట్టం వచ్చేనాటికి దేశంలో కోల్ ఇండియా, సింగరేణి ఉన్నాయిని.. అయితే, ఈ చట్టం గనులను కచ్చితంగా వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదు అని వెల్ల‌డించారు.

కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరన చేస్తామంటే కుదరదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణా అస్థిత్వాలు మరచి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. సింగరేణి గనుల వేలం ఆపాలి, వీలైతే సింగరేణికి మరిన్ని గనులు కేటాయించాలి, బొగ్గు తవ్వకాలపై సింగరేణికి హక్కు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement