Friday, November 22, 2024

ఇంకా పరిష్కారం కాని.. స్పౌజ్‌ బదిలీల లొల్లి!

ఉపాధ్యాయుల స్పౌజ్‌ కేసుల లొల్లి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టీచర్ల బదిలీల ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ బ్లాక్‌ లిస్టులో పెట్టిన 13 జిల్లాలకు సంబంధించిన స్పౌజ్‌ దరఖాస్తుల లొల్లి ఇంకా నడుస్తునే ఉంది. అటూ అధికారులు, ఇటు స్పౌజ్‌ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులూ ఏమాత్రం వెనక్కి తగ్గ డంలేదు. ఆ జిల్లాల్లో బదిలీలు చేపట్టాల్సిందేనని, భార్య భర్తలిరువురినీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తుంటే.. మరోవైపు అధికారులు మాత్రం ఆ అంశం తమ పరిధిలో లేదని బదులిస్తున్నారు. నూతన జోనల్‌ విధానంలో భాగంగా చేపట్టిన టీచర్ల బదిలీల ప్రక్రియ తొలి నుంచి గందరగోళంగానే మారింది. స్పౌజ్‌ దరఖాస్తులు ఇంకా సర్దుబాటు చేయకపో వడంతో టీచర్లు ఇంకా ఆందోళనలు చేపడుతునే ఉన్నారు. భార్యా భర్తలిద్దరూ స్పౌజ్‌ అప్పీల్‌ పెట్టుకుంటే వాటిని పరిశీలించకుండానే ఇద్దరికీ వందల కిలోమీటర్లలోని వేరే వేరే జిల్లాలకు బదిలీ చేశారని ముందు నుంచి టీచర్లు ఆరోపిస్తున్నారు. స్పౌజ్‌ బదిలీల కోసం అన్ని జిల్లాల నుంచి సుమారు 6 వేల వరకు దరఖాస్తులు విద్యాశా ఖకు అందగా వాటిలో సుమారు 2వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 4వేల దరఖాస్తుల్లో 2వేల వరకు పరిష్కారం కాగా, ఇంకా దాదాపు 2300 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని బాధిత టీచర్లు చెప్తున్నారు.

వీటిలోనూ 200 నుంచి 300 వరకు దరఖాస్తులు కొందరు అధికారుల తప్పిదం వల్ల స్పౌజ్‌ లిస్టు (ఐఎఫ్‌ ఎంఐఎస్‌ ఎంట్రీలో) నుంచి గల్లంతైనట్లు ఉపాధ్యా యులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై బాధిత టీచర్లు, టీచర్‌ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ముందు నుంచి ఇష్టారీతిన టీచర్ల సర్దుబాటు చేశారని గగ్గోలు పెడుతున్నారు. ఈక్రమంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం (డీఎస్‌ఈ) ముందు నల్గొండ, సిద్ధిపేట్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ ఇతర జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఉపాధ్యాయులు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. భార్యా భర్తల టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, దంపతులను ఒకేచోటుకి బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. భార్యాభర్తలను ఒకే ప్రాంతంలో పని చేసే విధంగా అవకాశం ఇవ్వాలని బాధిత ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి..

జీఓ 317 అమలు కారణంగా సీనియారిటీలో తప్పిదా లు, ఉద్యోగ దంపతుల ఎడబాటు, స్పెషల్‌ కేటగిరీ వర్తింపులో అన్యాయం జరిగిన టీచర్ల అప్పీల్స్‌ను పరిష్కరించి వెంటనే న్యాయం చేయాలి. హోల్డ్‌లో ఉంచిన 13 జిల్లాల స్పౌజ్‌ దరఖాస్తులు 2650లో కేవలం 300 మాత్రమే పరిష్కారం చేశారు. మిగిలిన అప్పీల్స్‌ కూడా చేయాలి. వితంతువులు, ఒంటరి మహిళల పట్ల సానుభూతితో వ్యవహరించి స్పెషల్‌ కేటగిరీగా పరిగణించాలి. గత ఏడేళ్లుగా నిలిచిపోయిన ఉపా ధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను చెపట్టాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement