హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఈపీ-2020 అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈమేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. సోమవారం నగరంలోని పలు కార్యక్రమాలకు హాజరైన కేంద్ర మంత్రికి ఉపాధ్యాయ సంఘం నేతలు నవాత్ సురేష్, పెంటయ్య, బి.ఉషారాణి తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఎస్‌జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని, కేజీబీవీ టీచర్లకు సర్వీస్ రూల్స్‌ను కల్పించవలసిందిగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌ని ఎనిమిది లక్షలకు పెంచవలసిందిగా మంత్రిని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.