నిర్మల్ ప్రతినిధి ప్రభ న్యూస్ : ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరో 24 గంటల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీపాడ్ లను సిద్ధంగా ఉంచాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement