Saturday, December 28, 2024

KHM | ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై రాష్ట్ర హౌసింగ్ ఎండీ ఆకస్మిక త‌నిఖీ

బూర్గంపాడు, డిసెంబర్ 28(ఆంధ్రప్రభ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామంలో శనివారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి వి.పి గౌతమ్ ఇందిరమ్మ ఇళ్ల సర్వే పనితీరుపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను మొబైల్లో ఇంటింటి సర్వే తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని దళారులు ఎవరైనా డబ్బులు అడిగినా ఇవ్వొద్దని, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆయన తెలిపారు. సర్వే సమయంలో క్షేత్రస్థాయిలో భూమి విస్తీర్ణం అంచనా కచ్చితంగా వేయాలని సర్వే సిబ్బందికి సూచించారు. ఆయన వెంట భద్రాచలం ఐటిడీఏ పీఓ రాహుల్, హౌసింగ్ పీడీ శంకర్, జేసీ వేణుగోపాలరావు, మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి, మండల త‌హ‌సీల్దార్ ముజాహిద్, గ్రామపంచాయతీ కార్యదర్శి బిందుష, ఆర్ఐ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement