ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు భారత్ లోనే ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. బీబీనగర్ లోని ఎయిమ్స్ ను కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీలో తీసుకున్నారు.. తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రస్తుతం 25 ఆక్సిజన్ పడకలతో కూడిన కోవిడ్ చికిత్స విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 200 పడకలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్సిజన్,మెడిసిన్ కొరత తీర్చడానికి ఐదు వందల కంపెనీలు పనిచేస్తున్నాయని వివరించారు. కరోనా తీవ్రత తగ్గాలంటే ప్రజల సహకారం అవసరం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement