Thursday, November 21, 2024

Special Story : స్టార్​ లీడర్​… ట్రెండ్​సెట్టర్… పొంగులేటి

- Advertisement -

ఆంధ్రప్రభ, హైదరాబాద్​ :

చాలామంది ట్రెండ్ ను ఫాలో అవుతారు. కొందరు మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ట్రెండ్ సెట్టర్. గాలి దిశను మలుపుతిప్పిన యోధుడు. తెలంగాణ పాలిటిక్స్ ను కూలంకషంగా ఔపోషన పట్టి ప్రేమను పంచి.. జనం గుండెలు గెలిచిన ప్రజానాయకుడు.

ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు.. తెలంగాణ పాలిటిక్స్ లో ఆయనో ట్రెండ్ సెట్టర్. ప్రజలు శీనన్న అంటూ ప్రేమగా పిలుచుకునే ఆయన వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకం. నిన్నటి అసెంబ్లీ ఎన్నికలైనా.. ఇప్పటి లోక్ సభ ఎన్నికలైనా, ప్రతిపక్షమైనా ప్రభుత్వమైనా శ్రీనన్న బరిలోకి దిగాడంటే ఛాలెంజ్ సంపూర్ణమవ్వాల్సిందే. పట్టుబట్టి ఖమ్మం జిల్లాలో కారును అసెంబ్లీ గేటు తాకకుండా చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఎట్రాక్షన్.

తిరుగులేని జననాయకుడు

పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ధనబలం అని ప్రత్యర్ధులు అంటారు. కానీ జనబలం అని ప్రతీ సందర్భంలోనూ రుజువైంది. డబ్బుంటే నాయకులు కారు. డబ్బున్నోళ్లందరూ రాజకీయాల్లో రాణించరు. జనం హుదయాలు గెలిచిన వారు మాత్రమే ప్రజానాయకులు అవుతారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని జనబలంతో అసమాన నాయకుడిగా ఎదిగాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవమానాలతో రాటుదేలిన ఆయన.. ఎంతో రాజకీయ పరిణతితో రాష్ట్రంలో ప్రభుత్వమార్పులో కీలకంగా మారాడు. ప్రజాభిమానం చూరగొనడం, జనం గుండెల్లో గూడుకట్టుకోవడం అంత తేలికైన పనికాదు. జనం కళ్ళల్లో ఆనందమే తన ఆనందంగా పనిచేసే నిఖార్సయిన నాయకుడిగా గుర్తింపుపొందడం అంత ఈజీకాదు. కఠోరశ్రమతో ప్రజల పల్స్ పట్టుకుని అవసరాలు తీరుస్తూ, అండగా ఉంటూ తిరుగులేని జనాదరణ సాధించాడు. అతి తక్కువ సమయంలో రాష్ట్రస్థాయిలో కీ లీడర్ గా ఎదిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టేట్ పాలిటిక్స్ లో మచ్చలేని మహారాజు. 2014లో రాజకీయ అరంగేట్రం చేసి నమ్ముకున్న వారికి నేనున్నానని భరోసా ఇస్తూ కష్టానికి సుఖానికి తోడుగా ఉన్నాడు పొంగులేటి. పదేళ్లలోనే ఇంత పాపులారిటీ ఎలా సాధించాడని తలలుపండిన రాజకీయ వ్యాపారవేత్తలు అసూయపడుతున్నా ఆయన కఠోర శ్రమ, ప్రజలకోసం వెచ్చించిన సమయమే ఈరోజు విజయతీరాలపై తిరుగులేని నేతగా నిలిపింది.

పొంగులేటి అంటే సక్సెస్

పొంగులేటి అంటే విజయానికి కేరాఫ్. ఒక్క శ్రీనివాసరెడ్డిని వదులుకోకుండా ఉంటే నెంబర్ గేమ్ లో వెనుకబడి ఉండేవారం కాదని బిఆర్ఎస్ సమీక్షల్లోనూ చర్చ జరుగుతున్నదంటే ఆయన సామర్ధ్యం స్పష్టమవుతోంది. కాంట్రాక్టర్ నుండి ఎంపీగా, ఇపుడు మంత్రిగా ప్రతీ దశలో విజయాలు సాధించడం పొంగులేటికే సాధ్యమైంది. గులాబాపార్టీలో ఎంతో ఓర్పుగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే పదవుకోసం తొందరపడే వాడు కాదని తెలంగాణ సమాజమంతా చూసింది. అవకాశాలు ఇవ్వకున్నా, అడుగడుగునా అవమానించినా తనను సస్సెండ్ చేసేవరకు పొంగులేటి ఆ పార్టీని వీడలేదు. ఒక్కసారి పొంగులేటి ఆ పార్టీని వీడాక పార్టీ పతనం ఖరారైంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయమే బిఆర్ఎస్ ఓటమిలో ప్రధాన కారణమని విశ్లేషకుల మాట. ఆయనను వదులుకోకుండా ప్రోత్సహించి ఉంటే ఈరోజు బిఆర్ఎస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదని గులాబీపార్టీ క్యాడర్ బాహాటంగా చెబుతున్నారు. పొంగులేటి ఇమేజ్ సర్వేల ద్వారా తెలుసుకుని ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, ఆయన బాధ్యత తీసుకుంటే విజయం పక్కా అనే అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో వినబడుతోంది. ఇక పొంగులేటి కోసం ప్రయత్నం చేసిన బిజెపి ఆయనను తెచ్చుకుని ఉంటే బాగుండేదని ఇప్పటికీ అంతర్గత సంభాషణల్లో మథనపడుతోంది. పొంగులేటి సమర్థతకు, పనితీరుకు ఇవే గీటురాళ్లు. రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖల ద్వారా ప్రభుత్వంలోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంలోనూ తనదైన ముద్రవేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాడు. శ్రీనన్న అంటే తెలంగాణలో ఇపుడు ఓ స్పెషల్ క్రేజ్.

శీనన్న అంటే బ్రాండ్

శీనన్న అనేది ….ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల హృదయాల్లో. ఏర్పడిన బ్రాండ్ .నాటి బిఆర్ఎస్ పార్టీలో ఆ బ్రాండ్ అడుగడుగునా ఆయనకు కష్టం కలిగించింది. ఆ బ్రాండ్ కు భయపడ్డవారు రాజకీయంగా నష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలో వ్యక్తి ఆరాధన సహజంగా అదిష్టాన వర్గాలకు రుచించవు ఈ విషయమే శ్రీనివాస్ రెడ్డి కి శాపంగా మారింది .రాజకీయంగా అవమానాలు మిగిల్చినా …పొంగులేటి రాజీ పడలేదు. ప్రజల హృదయాల్లో ఉన్న అభిమానం కాపాడుకున్నాడు. పదవులు రాకున్నా …బ్రాండ్ ఇమేజ్ కే మొగ్గుచూపి తాను ప్రజల పక్షం అని నిరూపించుకున్న నాయకుడు శీనన్న. ప్రేమే లక్ష్యం -సేవే మార్గం అంటూ -2009 లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి ఇచ్చిన నినాదం నిజం చేసిన ఘనత పొంగులేటిది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలకు అయన ప్రేమ సేవను పంచి వారి హృదయాల్లో స్థానం సంపాదించాడు . కులాలకు -మతాలకు -పార్టీలకు అతీతంగా -ప్రతి కుటుంబంతో ఆయన చనువు ఏర్పాటు చేసుకున్నాడు . ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏదైనా విషాద ఘటన జరిగినా ఏదైనా ఆపద వచ్చినా నేనున్నా అంటూ పొంగులేటి ముందుడేవాడు.

ప్రజలే కుటుంబం

వ్యాపార వేత్త గా -రాజకీయ నాయకుడిగా క్షణం తీరిక లేనంత పని వత్తిడి ఉన్నా …ప్రజల కష్ట సుఖాల్లో భాగ స్వామి కావడం తన శక్తి మేరకు సహాయం చేయడం ఆయన ఇమేజ్ అమాంతం పెంచాయి. కేవలం వారి కష్ట సుఖాల్లో -భాగస్వామి కావడమే కాదు తన ఇంట జరిగే శుభకార్యాల్లో కూడా జిల్లాలో ప్రతి ఇంటిని ఆహ్వానించిన గొప్ప మనసు ఆయనది .ఇంటింటికి పెళ్లి కార్డ్ పంపి గోడ గడియారం జ్ఞాపికగా ఇచ్చి రవాణా సౌకర్యం కల్పించి మరీ తన ఇంట శుభకార్యంలో భాగస్వామిని చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరివాడయ్యాడు. పొంగులేటిని నిలుపుకునేందుకు చివరివరకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నం చేసినా రాజకీయ ప్రత్యర్ధులు అడ్డుపడ్డారు. పొంగులేటి ని దూరం చేసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ లో ముందే పసిగట్టిన ఏకైక నేత కేటీఆర్. పదేపదే నాటి ఎమ్మెల్యేలను కలిసి పనిచేయాలని చెప్పినా ఖాతరు చేయకుండా పార్టీ పుట్టిముంచారన్న అసహనం క్యాడర్ లో ఉంది. శ్రీనివాసరెడ్డి విషయంలో అప్పటి జనబలం లేని వలసనేతలు సీఎంకు చెప్పుడుమాటలతో చెవులో జోరీగలా నూరిపోయడం వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. శ్రీనివాసరెడ్డి సామర్ధ్యం సమర్ధత ప్రపంచానికి తెలిసింది. ఇపుడు రాష్ట్రంలో క్రియాశీల కీలక నేతగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగొందుతున్నారు. రాజకీయాల్లో ప్రజలతో మమేకమైన నాయకులను ఎంతోకాలం అణచలేరన్న విషయానికి శ్రీనన్నే ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలో కీలకమంత్రిగా పొంగులేటి తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement