Friday, December 20, 2024

Stampede Case – లైసెన్స్ ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దు .. సంధ్య ధియేట‌ర్ కు నోటీసులు

హైద‌రాబాద్ – సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడంతో విడుదల చేశారు. బన్నీ బెయిల్ రద్దు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇదే సమయంలో కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షాక్ ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ పై షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై వారం రోజుల‌లో స‌మాధానం ఇవ్వాల‌ని ఆందులో కోరారు.. సంతృప్తిక‌ర స‌మాధానం రాకుంటే ధియేట‌ర్ లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement