Saturday, December 14, 2024

Stampede Case – చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

హైదరాబాద్ – సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్‌ చంచల్‌గూడ జైలు నుంచి నేటి ఉదయం బెయిల్‌పై విడుదలయ్యారు.

ఆనంతరం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, తాను బాగానే ఉన్నానని, ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. . తాను చట్టాన్ని గౌరవిస్తాననీ చెప్పారు.

తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ,రేవతి గారి కుటుంబానికి సానుభూతి తెలిపిన అల్లు అర్జున్

జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని పేర్కొన్నారు . కేసు కోర్టు పరిధిలో ఉందనీ, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేననీ చెప్పారు

కాగా, తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అతని విడుదలకు మార్గం సుగమైంది. శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో అల్లు అర్జున్‌ జైలు నుంచి బయటకొచ్చారు. మధ్యంతర బెయిల్..అల్లు అర్జున్‌ తరుపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ విచారణ సంధర్భంగా తెలంగాణ హైకోర్టు నటుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

ఈ కేసులో అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన 105(B), 118 సెక్షన్లు వర్తించవని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అల్లు అర్జున్‌కు నిరాకరించలేమని, ఆయనకు జీవించే హక్కు ఉన్నదని పేర్కొంది. రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తుపై అతన్ని విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. అర్ణబ్ గోస్వామి vs మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తెలంగాణ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.అంతుకుముందు తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement