Home తెలంగాణ‌ Stampade – సంధ్య థియేటర్‌ లో తొక్కిసలాట – ముగ్గురి అరెస్ట్

Stampade – సంధ్య థియేటర్‌ లో తొక్కిసలాట – ముగ్గురి అరెస్ట్

0
Stampade –   సంధ్య థియేటర్‌ లో  తొక్కిసలాట – ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ఈనెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ సంధ్య థియేటర్‌ యాజమాన్యానికి సంబంధించి ముగ్గురుని అరెస్ట్ చేసినట్టు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

Exit mobile version