Sunday, November 24, 2024

TS | స్టాఫ్ నర్సు ఫలితాలు విడుదల.. ఈ నెల 20లోపు అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. 7,094 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకిగాను గత ఆగస్టు నెలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను మెడికల్‌ హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు టీ-ఎస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ వెబ్‌సైట్‌లో ప్రాథమిక జాబితాను అందుబాటులో ఉంచింది. ఫలితాల విషయంలో అభ్యర్థులు పొందిన పాయింట్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే బోర్డు దృష్టికి తేవాలని, ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనునట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement