Wednesday, November 20, 2024

ఎస్ఆర్ఎస్పీకి కొనసాగుతోన్న వరద..

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువ భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక ప్రాజెక్టులోకి 3446 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 29.509 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 30.998 టీఎంసీల నీరు ఉన్నది. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1070.30 మీటర్లు కాగా, ఆదివారం ఉదయం 6 గంటల వరకు 326.23 మీటర్ల నీటిమట్టం ఉన్నది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 12.942 టీఎంసీల నీరు వచ్చి చేరింది.

ఇది కూడా చదవండి: డోలో వేసుకునేదానికి కేసీఆర్ యశోదాకు ఎందుకు వెళ్లారు?: విజయశాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement