Tuesday, November 26, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటు – ఏ క్షణంలో నైనా గేట్లు ఎత్తివేసే అవకాశం

ఆర్మూర్ : ప్రభ న్యూస్ : జూలై 27: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1086.50 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర లో మరియు ఉత్తర తెలంగాణాలో  అతిభారీ వర్ష సూచన కారణంగా ఏక్షణం లోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి ,గోదావరి నది లోకి వదిలే అవకాశం ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు

.రెవిన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవలసిందిగా, గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు ,గొర్రెలు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement