Tuesday, November 26, 2024

క‌న్నుల పండువ‌గా శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహుని డోలారోహ‌ణం

నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నింబాచల క్షేత్రంపై కార్తిక మాస బ్రహ్మౌత్సవాలు అంగరంగ వైభవముగా కొన సాగుతున్నాయి. కార్తిక మాస శ్రీ లక్ష్మీ నరసింహుని ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహునికి సీతానగరిపై డోలారోహణం కార్యక్రమాన్ని కమనీయంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తికమాసంలో శ్రీహరికి నిర్వహించే ఉత్సవాలు ఎంతో ప్రీతికరమైనవని అర్చకులు తెలిపారు. డోలారోహణం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను అర్చక బృందం సభ్యులు స్వర్ణాలంకార భూషితులైన శ్రీలక్ష్మీ నరసింహుని ఉత్సవ విగ్రహలను రంగు రంగుల పూలతో అలంకరించి పల్లకిలో ఉంచి వేదమంత్రాలు పటిస్తూ మేళతాళాలు, మంగళహరతులు, డప్పుల చప్పుల్లు వెంటరాగా సీతానగరి వరకు ఎదుర్కోలు నిర్వహించారు. సీతానగరిలో ఉన్న మండపంలో వెండి ఊయలపై శ్రీ లక్ష్మీ నరసింహుల ఉత్సవ విగ్రహలను ఉంచి లాలి పాటలు పాడుతూ భక్తి పారవశ్యంతో డోలా సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. డోలా సేవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించిన భక్తజనులు పారవశ్యంతో మునిగితేలారు. డోలా సేవ ముగించుకుని తిరుగు ప్రయాణమున జోడు లింగాలకు లక్ష్మీ నరసింహులను ఎదురుగా నిలిపారు. భక్తజనులు జోడు లింగాలను దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement