హైదరాబాద్: టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో ఆయన మాట్లాడారు. మీసేవ మొబైల్ యాప్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు.
- Advertisement -