శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున భారీ వర్షాలతో గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. జలాశయంలో ప్రస్తుతం 1069 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు నీటినిల్వ 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 30 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 11.95 టీఎంసీల నీరు చేరింది.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్!!