Friday, November 22, 2024

శ్రీ చైతన్య కాలేజ్‌ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్ సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో తన క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు…. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలిసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదు. తోటి విద్యార్థులే.. ఓ వెహికల్‌ని లిఫ్ట్ అడిగి, సాత్విక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ మృతిచెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నార

సాత్విక్ ఆత్మహత్యపై తోటి విద్యార్థులు మాట్లాడుతూ.. సాత్విక్ చాలా మంచి స్టూడెంట్ అని, అయినా అతడ్ని ‘ఫెయిల్యూర్ ఫెయిల్యూర్’ అంటూ టీచర్లు వేధించేవారని అన్నారు. అతడ్ని ఎక్కువగా కొట్టేవారని కూడా చెప్పారు. కొందరు లెక్చరర్స్ తమతోపాటు సాత్విక్‌తో కూడా చాలా రూడ్‌గా బిహేవ్ చేసేవారని, దాంతో అతడు మెంటల్‌గా డిప్రెస్ అయ్యారని పేర్కొన్నారు. ఆ డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వెల్లడించారు. అటు.. తమ తనయుడి ఆత్మహత్యతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు, కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. గతంలో లెక్చరర్స్ కొట్టడం వల్ల తమ కుమారుడు పదిహేను రోజులపాటు ఆసుపత్రి పాలయ్యాడన్నారు. సాత్విక్‌ను ఏం అనకండి తాము గతంలో రిక్వెస్ట్ చేసినా, అతడ్ని మెంట్ స్ట్రెస్‌కి గురి చేశారన్నారు. కాలేజీ సిబ్బందిలో ఒక్కరు కూడా ఆసుపత్రికి రాలేదని, తమ అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని బోరున విలపించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement