హైదరాబాద్ – చదువుల ఒత్తిడి భరించలేకున్నాం… తాము ఇక్కడ ఉండలేమంటున్న మియాపూర్‌లోని చైతన్య గర్ల్స్ క్యాంపస్ విద్యార్థినిలు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటూ గోడ మీద రాతలు రాశారు. దీనిని చూసిన యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తాము ఇంటి వెళ్లిపోతామంటుని వారు చెబుతున్నట్లు సమాచారం. క్యాంపస్‌లో మొత్తం 15 వందల మంది ఉండగా.. 12 వందల మంది ఇంటికి వెళ్లిపోయారు. మరో మూడు వందల మంది మాత్రమే ప్రస్తుతం హాస్టల్ ఉన్నారు. వీరు కూడా ఇంటికి వెళ్లిపోతామని చెబుతున్నట్లు సమాచారం. అయితే ఈ రాతలు చెరిపేసేందుకు కాలేజీ సిబ్బంది ప్రయత్నించారు.
అంతే కాదు మూడు రోజుల పాటు కాలేజీకి ఔటింగ్ ఇచ్చామని చెప్పి ఉద్యార్దులను ఉన్నపళంగా ఇంటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. మంచిగా చదవులు చెబుతారని.. పిల్లలు భవిష్యత్తు బాంగుండాలని కాలేజీలో జాయిన్ చేస్తే.. యాజమాన్యం మాత్రం పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్నారంటూ .. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు.. విద్యార్ధునిలు..
శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్ తమపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని విద్యార్ధునులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం చదువులు, మార్కులు అంటూ ర్యాష్‌గా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇదే కాలేజీలో ఇటీవల ఓ విద్యార్ధి ఒత్తిడి కారణంగానే బ్లేడ్‌తో చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. గత కొద్దిరోజుల క్రితం మరో అమ్మాయి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయతినించిందని మీడియా ముందు వాపోయారు. ఇలా వరుస ఘటనలు తమను తీవ్ర ఆందోళకు గురిచేస్తున్నాయని విద్యార్ధునిలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వత్తిడిలో చదువు కొనసాగించలేక చనిపోదామని అనుకుంటుమన్నామంటూ వారు చెబుతున్నారు.
ఒకే రోజు విద్యార్దులు ఆత్మహత్య…
ఇదిలా ఉంటే.. సోమవారం నాడు మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనూష్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు,. లెక్చరర్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.. అలాగే నిజామాబాద్ లోకూడా నిన్న ప్రజ్ఞారెడ్డి అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చదువుల వత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సహ విద్యార్ధులు చెబుతున్నారు..