హైదరాబాద్ – రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ రెండో బ్యాచ్ కన్ సైన్మెంట్ రష్యా నుంచి నేరుగా విమానంలో నేడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోంది. మొత్తం 1.50 లక్షల డోసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. వాటినీ అక్కడికి నుంచి వాటిని రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు. దేశానికి రష్యా నుంచి మొత్తం 67 లక్షల డోసులు చేరుకోనున్నాయి. వాటిల్లో భాగంగానే విడతల వారీగా స్పుత్నిక్-వీ వస్తోంది. ఈ నెల మొదటి వారంలో తొలి విడత గా 1.50 లక్షలు వచ్చాయి.. తాజాగా నేడు మరో 1.50 లక్షలు డోసులు చేరుకున్నాయి..కాగా, , వచ్చే నెల నుంచి దేశంలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది. దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ఒక్కో డోస్ ధర రూ.995గా కేంద్రం నిర్ణయించింది.. ఈ ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయనుంది రెడ్డిస్ ల్యాబ్..