Tuesday, November 26, 2024

స్పౌజ్ బదిలీలు చేపట్టండి – మంత్రులకు స్పౌజ్ ఫోరమ్ సభ్యుల వినతి

నిజామాబాద్ / హైద‌రాబాద్ – మార్చి (ప్రభ న్యూస్) 8: 13 జిల్లాలో ఎస్జిటి, ఎల్పీ, పీఈటీ, మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు చేప ట్టాలని స్పౌజ్ ఫోరమ్ సభ్యు లు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి లను కోరారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్స వం పురస్కరించుకొని హైదరా బాదులో మంత్రి నివాసంలో మహిళా ఉపాధ్యా యినులు విద్యాశా ఖామంత్రి సబీతా ఇందారెడ్డిని కలిశారు. స్పౌజ్ బాధితుల్లో 80 శాతం మహిళా ఉపాధ్యాయునులే ఉన్నారని మంత్రితో తమ గూడుని మొరపెట్టుకొని వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కలసి తమ సమస్యలను విన్న వించుకొని వినతి పత్రం అంద జేశారు.

ఈ సందర్భంగా సభ్యు లు మాట్లాడుతూ 2100 స్పౌజ్ అప్పీల్లలో కేవలం 30% మంది దంపతులకే బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడ ర్లను పక్కకు పెట్టడం వలన స్పౌజ్ బదిలీల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలలో ఆవే దన మిగిలిందని మహిళా ఉపా ధ్యాయులు వాపోయారు. ప్రతిరోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ, డ్యూటీలు చేస్తూ కష్టనష్టాలను పడుతున్న వారిలో 80 శాతం మంది మహి ళా ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఎక్కువ మందికి అయిదు సంవత్సరాలు లోపు వయసున్న పిల్లలు ఉన్నారని, ఇంకా 25 సంవత్సరాల పైబ డిన సర్వీసు ఉందన్నారు. ఇటు కుటుంబానికి అటు విద్య బోధనకు పూర్తిస్థాయిలో సమ యం కేటాయించలేక మహిళా ఉపాధ్యాయులను తీవ్ర మానసిక వేదనకు లోనవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 13 జిల్లాలో ఎస్జిటి, ఎల్పీ, పీఈటీ, మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ ఫోరమ్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, గంగామణి, కృష్ణవేణి, ప్రతి భారాణి, మాధురి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement