క్రీడలు క్రీడాకారులకు ఆనందం, ఆరోగ్యంతో పాటు అందరికి స్పూర్తి దాయకంగా ఉంటాయని, అలాగే క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్, నాగోల్లోని స్కంద బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సమన్వయంతో రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్ ముగింపు, (13 ఏళ్లలోపు) (15 ఏళ్లలోపు వారు) అబ్బాయిలు అండ్ బాలికలు అవార్డులు ప్రదానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో అండర్ 13, అండర్ 15 (బాయ్స్ అండ్ గర్ల్స్) గెలుపొందిన వారికి బీఎస్ 13 బీఎల్ విన్నర్ హర్ష వర్ధన్, జీఎస్ 13 విన్నర్ బీఎల్ హర్ష చంద్రం హాంశిని, బీడీ 13 విన్నర్ అభిరామ్ త్రిపుర నేని, జీడీ 13 విన్నర్ చంద్రం హాంశిని, బీఎస్ 15 విన్నర్ అర్జున్ తనజీ బిరాదర్ లకు అవార్డులు అందజేశారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు నిర్వహించిన బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్ అవార్డులు అందజేస్తున్న రోజు ముగింపు సందర్భంగా.. పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి టోర్నమెంట్ నిర్వహిస్తూ అంకితభావంతో పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులుగా మీరు సాధించిన ప్రతి విజయం ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సాహించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన భాధ్యతలు ప్రతి ఒక్కరూ తీసుకొవాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జిల్లాకు, ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో.. మల్రెడ్డి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, చైర్మన్ ఆర్ఆర్ డీబీఏ, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కారెడ్ల శ్రీనివాస రావు, కె.పాణి రావు కోశాధికారి బీఏటీ, కార్యదర్శి హెచ్ డీబీఏ, టోర్నమెంట్ చీఫ్ రిఫరీ, టోర్నమెంట్ కమిటీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ సూరి, కన్వీనర్ సాయి రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.