హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్ దగ్గర కారులో బాలికను తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను పోలీసులు తమదైన స్టైల్‌లో ఎంక్వైరీ షురూ చేశారు. ఇవ్వాల (శనివారం) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ నుంచి నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ని తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. కాగా, వీరిలో అయిదుగురు మైనర్లు ఉండడంతో వారిని బయట ఎవరికీ తెలియని ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ కేసు విషయంలో ప్రజల నుంచి చాలా డౌట్లు వినిపిస్తున్నాయి.. ఇప్పటిదాకా ఇన్నోవా కారు ఓనర్‌పై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని, బెంజ్ కారు యజమానిని పిలిచి ఎందుకు విచారణ జరపలేదన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. కాగా, సోషల్ మీడియాలో సైతం ఈ కేసు విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
దిశ ఇన్సిడెంట్ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. అప్పుడు లారీ డ్రైవర్లు, క్లీనర్లు కాబట్టే వారిని పోలీసులు చంపేశారని, ఇప్పుడు రాజకీయ పలుకుబడి కలిగిన వారి కుమారులు కావడంతో వారిని ఏమీ అనడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మైనర్లు అన్న ముసుగులో ఈ కేసు నుంచి పెద్దలు తప్పించుకునే ప్లాన్ జరుగుతోందని, అసలు నిందితులు వేరే ఉన్నారని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా వారు చేసింది కిరాతకమైన పని అయినప్పుడు ఎందుకు పోలీసులు కాపాడుతున్నారో, ఎవరికోసం వారిని వెనకేసుకువస్తున్నట్టు అనే ప్రశ్నలు కూడా సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. దీనికి అందరి నోళ్లు మూయించాలంటే దిశ ఇన్సిడెంట్ మాదిరిగానే పోలీసులే సరైన జవాబు చెప్పాల్సి ఉంటుందని చాలామంది కోరుకుంటున్నారు.