Friday, November 22, 2024

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త దంప‌తుల‌ ప్రత్యేక పూజలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని ఈరోజు తెలంగాణ టూరిజం కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త సతీ సమేతంగా దర్శనం చేసుకొని, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా..ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్దతుల్లో పూజాదికాలు నిర్వహించారు. అనంతరం శాలువాలతో సత్కరించి, ఆశీర్వచనాలు అందించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ప్రజలకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగి, వారు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని శ్రీ రామలింగేశ్వర స్వామిని కోరుకోవడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. కార్తీకమాసం అంటేనే పూజా కార్యక్రమాలకు ప్రసిద్ధి అని అన్నారు. అత్యంత మాహిమాన్వితమైన, అనుకున్నవి.. అనుకున్నట్లు కోరుకున్న కోరికలు తీర్చే పరమ పవిత్రమైన కార్తీకమాసంలో కీసర గుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామి వారికి అభిషేకం చేసి, దర్శనము చేసుకున్నామ‌న్నారు. కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామికి ఈరోజు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా దేవాలయాలు నిలుస్తున్నాయన్నారు. కార్తీకమాసం అంటేనే పూజా కార్యక్రమాలకు ప్రసిద్ధి అని అన్నారు. మన పూర్వీకులు చెట్లను, పుట్టలను, రాయిని, కొండను, నదిని, పశు పక్షాదులను, సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా భావించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.

సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధికి అధిక నిధులు విడుదల చేసి అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1400 కోట్లతో యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణం చేస్తున్నారన్నారు. న:భూతో..న:భవిష్యత్..లాగా తెలంగాణ తిరుపతి లాగా భువనగిరి యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నే పేద బ్రాహ్మణులను, పూజారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి జీతంతో ఆదుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తూ.. పూజారులకు నెల నెలా జీతాలు ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధిలో మన తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, సుభిక్షంగా ఉండాలని, రైతులంతా పాడి పంటలతో విలసిల్లాలని, అందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో.. టెంపుల్ చైర్మన్ నాగలింగం, బోర్డ్ మెంబెర్స్ శ్రవణ్ గుప్త, రమేష్ యాదవ్, బుచ్చిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement