రేపు అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా రామనామాన్ని జపిస్తున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు నలుమూలల నుంచి భక్తులు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయోధ్య బాలరాముని వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను రాష్ట్రం నుంచి నడనుంది. ఈనెల 29 నుంచి వచ్చే మార్చి 3వ తేదీ వరకు అయోధ్య ధాం రైల్వే జంక్షన్‌కు సికింద్రాబాద్, ఖాజీపేట, జాల్నా నుంచి ఆస్థా స్పెషల్ సర్వీసులు నడపనున్నారు.
సికింద్రాబాద్ జంక్షన్ పరిధిలో…
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయోధ్య ధాం జంక్షన్‌కు రైలు నంబర్ (07221)ను నడుపనున్నారు. ఇది ఈనెల 29వ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ మధ్య వారంలో మూడు రోజుల (మొత్తం 16ట్రిప్‌లు)పాటు నడుస్తుంది. ఇది జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో సాయంత్రం 4:45 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. మార్గమధ్యలో కాజీపేట జంక్షన్‌కు సాయంత్రం 6:20 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కు రాత్రి 7:38కు, రామగుండానికి రాత్రి 8 గంటలకు వచ్చి, రెండురోజుల ప్రయాణం తర్వాత ఉదయం 3:30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి అయోధ్య నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు రైలు నంబర్ (07222) ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో, మార్చి 1, 3 తేదీల్లో నడుస్తుంది. ఇది అయోధ్య నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. మార్గమధ్యలో రామగుండానికి సాయంత్రం 06:30, పెద్దపల్లి జంక్షన్‌కు 7కు, కాజీపేట జంక్షన్‌కు 8:08 గంటలకు చేరుకుంటుంది.
కాజీపేట జంక్షన్ పరిధిలో.. కాజీపేట నుంచి అయోధ్య ధాం జంక్షన్ రైల్వే స్టేషన్‌కు రైలు నంబర్ (07223) ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు వారంలో మూడు రోజులు (మొత్తం 15ట్రిప్‌లు) నడుస్తాయి. జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో ఖాజీపేట జంక్షన్ నుంచి సాయంత్రం 06:20 గంటలకు బయలుదేరుతుంది. పెద్దపల్లి జంక్షన్‌కు రాత్రి 7:38కు, రామగుండానికి 8 గంటలకు చేరుకుంటుంది. రెండు రోజుల ప్రయాణం తర్వాత ఉదయం 3:35 గంటలకు అయోధ్య జంక్షన్ చేరుకుంటుంది. అయోధ్య జంక్షన్ నుంచి కాజీపేట జంక్షన్‌కు రైలు నంబర్ (07224) ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో, మార్చి 2న (మొత్తం15 ట్రిప్‌లు) నడుస్తాయి. ఇది అయోధ్య నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కాజీపేట జంక్షన్ చేరుకుంటుంది.
జాల్నా నుంచి..
జాల్నా నుంచి అయోధ్య ధాం జంక్షన్‌కు (వయా పర్భని-పూర్ణా-నాందేడ్-నిజామాబాద్-కరీంనగర్-పెద్దపల్లి-బల్లార్షా మీదుగా) రైలు నంబర్ (07649) ఫిబ్రవరి 4న నడుస్తుంది.ఉదయం 09:30గంటలకు జాల్నా రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి బాసరకు మధ్యాహ్నం 3:15 గంటలకు, నిజామాబాద్‌కు సాయంత్రం 4 గంటలకు, కోరుట్లకు 5:18కు, లింగం పేట్ జగిత్యాలకు 5:50కు, కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు 6:45కు, పెద్దపల్లి జంక్షన్‌కి 7:35కు, రామగుండానికి 8గంటలకు చేరుకొని 6న ఉదయం 3:35 గంటలకు అయోధ్య చేరుకోనున్నది. ఇక అయోధ్య ధాం జంక్షన్ నుంచి జాల్నా వరకు రైలు నంబర్ (07650) ఫిబ్రవరి 6న నడుస్తుంది. అక్కడ మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు శుక్రవారం ఉదయం 6 గంటలకు జాల్నా రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. మార్గమధ్యలో రామగుండానికి సాయంత్రం 7:25 గంటలకు, పెద్దపల్లి జంక్షన్‌కి 7:55కు, కరీంనగర్ రైల్వేస్టేషన్‌కి రాత్రి 8:35కు, లింగంపేట్ జగిత్యాల రైల్వేస్టేషన్‌కు రాత్రి 9:20కు, కోరుట్లకు రాత్రి 9:50కు, నిజామాబాద్ జంక్షన్‌కి రాత్రి 11:10కు, బాసర రైల్వేస్టేషన్‌కు 11:53 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు 6గంటలకు జాల్నా రైల్వేస్టేషన్‌కి చేరుకుంటుంది. ఈ రైళ్లలో 20 స్లీపర్ కోచ్ బోగీలు, 2సాధారణ బోగీలు ఉంటాయి.