మేడారం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈనెల 21న మహాజతర జరుగనున్న నేపథ్యంలో ప్రత్యేక జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
- Advertisement -
సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు, అలాగే నిజామాబాద్ నుంచి వయా సికింద్రాబాద్, వరంగల్ మధ్య 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటుగా కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు మరో ప్రత్యేక రైలు అందుబాటులో ఉందన్నారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మేడారంకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతున్నందున భక్తులకు ప్రయాణం సుగమం అవుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని క్షేమంగా దర్శనం చేసుకుని ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైల్వే అధికారులు కోరారు.