హోలీ పండగ సందర్భంగా ప్రయాణి కుల సౌకర్యార్థం హైదరాబాద్ , సికింద్రాబాద్ నుంచి విజయవాడ విశాఖ మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ట్రైన్ నెంబర్ 07647/07648 హైదరాబాద్ దానా పూర్ మధ్య రైలు శనివారం రాత్రం 8 గంటల 20 నిమిషాలకు బయల్దేరనుంది. ఆదివారం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు చేరనుంది.
ఈ రైలు సికింద్రాబాద్, జనగాం, ఖాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూరకాగజ్ నగర్, బాల్హర్షా, నాగ్ పూర్, ఇత్రాసి, పిప్రియా, జబల్ పూర్, కాత్ని, సాత్నా, మాణిక్పూర్, ప్రయాగ్ రాజ్ చెఓకీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్లో ఆగనుంది. దానాపూర్ హైదరాబాద్ మధ్య రైలు మంగళవారం మార్చి 26 సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు బయల్దేరనుంది. తిరిగి గురువారం ఉదయం 4 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోనుంది.
సికింద్రాబాద్, సంత్రాగచి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07645/07646 శనివారం రాత్రి 9.05కి సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటిరోజు అర్ధరాత్రి 12.15కి సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు సంత్రాగచిలో ఈ నెల 25వ తేదీ ఉదయం 5.45కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10కి సికింద్రాబాద్ చేరుతుంది.
ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగు రాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకా కుళం రోడ్, పలాస, బరంపురం, భువనేశ్వర్, కటక్, బాలాసోర్ స్టేష న్లలో ఆగుతుంది.