హైదరాబాద్, ఆంధ్రప్రభ: సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈనెల 14, 15 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తిరుమల వెళ్లే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరనున్న ప్రత్యేక రైలు (07485) ఆతర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకోనుంది. శనివారం తిరుపతి నుంచి రాత్రి 7.30 గంటలకు బయల్దేరే రైలు (07486) ఆదివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయిన సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement