Tuesday, November 26, 2024

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ కు ప్ర‌తివార్డులో స్పెష‌ల్ టీంలు

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ -2022లో భాగంగా ఈ రోజు నుండి ప్రతి వార్డ్ లో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినారు. ఈ టీంలో బిల్ కలెక్టర్, మహిళా ఆర్పీలు, సానిటరీ జవాన్ లు వుంటారు. వారిని సానిటరీ ఇన్ స్పెక్ట‌ర్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ కమీషనర్ పర్యవేక్షిస్తారు. వీరు ప్రతిరోజు వారి వార్డుల్లో స్వచ్ఛ‌ ఆటో వెంట వెళ్లి ఇంటింటికీ తిరిగి తడి చెత్త, పొడి చెత్త వేరుచేసే విధానాన్ని అందరికీ వివరించి స్వచ్ఛ‌ ఆటోల్లోనే వేయాలని అందరికి తెలియజేస్తారు.

ఈరోజు స్వచ్ఛ స‌ర్వేక్ష‌న్‌ -2022 కార్యక్రమంలో భాగంగా కమీషనర్ కుత్బుల్లాపూర్ ప‌రిధిలోని దొమ్మర పోచంపల్లిలో ఈ స్వచ్ఛ‌ సర్వేక్షన్ -2022 కార్యక్రమాన్ని పరిశీలించారు. అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా షాప్ ల వద్ద ప్లాస్టిక్ కవర్స్ 75 మైక్రాన్ కంటే తక్కువ వున్న ప్లాస్టిక్ కవర్స్ వాడవద్దని అందరికీ వివరించారు. మీ పరిసరాలు పరిశుభ్రంగా వుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ పి.భోగిశ్వర్లు, సానిటరీ ఇన్ స్పెక్ట‌ర్స్, కరుణాకర్ రెడ్డి, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ సాత్విక్, సానిటరీ జవాన్స్, మహిళా ఆర్పీ, మహిళా పొదుపు సంఘం మహిళలు, బిల్ కల్లెక్టర్స్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement