Friday, November 22, 2024

TS : డ‌బ్బుల త‌ర‌లింపు పై ప్ర‌త్యేక నిఘా… ఆర్డీవో గంగయ్య

సుల్తానాబాద్, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్): లోక్‌స‌భ‌ ఎన్నికల నేప‌థ్యంలో డ‌బ్బుల త‌రలింపుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పోలీసులు, అధికారులు చెక్‌పోస్టుల‌తో పాటు ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద వాహ‌నాలు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో గురువారం సుల్తాన్‌పూర్ మండలంలోని దుబ్బపల్లి చెక్ పోస్ట్ వ‌ద్ద తహ‌సిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎస్సై శ్రవణ్ కుమార్, ఎస్ ఎస్ సి టీం లీడర్ అనిల్ రెడ్డిలు చేపట్టిన వాహ‌నాల త‌నిఖీలను పెద్దపల్లి ఆర్ డి ఓ గంగయ్య ప‌ర్య‌వేక్షించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున‌ దృష్ట్యా ఎవరైనా రూ. 50 వేలకు మించి నగదు రూపేనా తరలిస్తే డబ్బులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు చేతులు మారే అవకాశాలు ఉన్నందున నేటి నుండి ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని వాహనాల తనిఖీల తో పాటు అనుమానితులను సైతం తనిఖీ చేపడతామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిత‌వు ప‌లికారు. కొత్తవారు ఎవరైనా గ్రామాలలో సందర్శించిన డబ్బులు పంపిణీ చేపడుతున్న ఎన్నికల అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు దుర్గాధర్ సతీష్, రమేష్ నాయక్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement