Tuesday, November 19, 2024

వీళ్లంటే….మృత్యువుకే భ‌యమే..

కామారెడ్డి, ప్రభన్యూస్‌: ఈ తండా అంటే మృత్యువుకే భయం.. చావు వీరి దరిదాపుల్లోకి కూడా రాదు. రోగాలు అంటే వీరికి తెలియదు. 40 ఏళ్లలో ఈ గ్రామంలో మరణించింది కేవలం ఏడుగురు మాత్రమే. ఆశ్చర్యంగొలిపే వీరి ఆరోగ్యంపై పరిశీలకులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. వీరి జీవనశైలి నిత్య యవ్వనంగా ఉంచుతోంది. వంద ఏళ్లు బతకడం ఇక్కడ మామూలు విషయం. సేంద్రియ కూరగాయలు, ఆకుకూర లతో వంటలు.. అడవి నుంచి తెచ్చుకున్న వంట చెరుకుతో భోజనం తయారు చేసుకోవడం, టీ-వీలు, ఫోన్లు తప్ప ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడరు. ఎల్పీజీ గ్యాస్‌ ఉపయోగించరు. సేంద్రియ కూరగాయలు, ఆహార అలవాట్లూ ఆరోగ్యానికి ప్రధాన కారణం. పచ్చని పొలాలు, అడవి గుట్టల మధ్య ప్రశాం తమైన జీవనం… ఎలాంటి కాలుష్యం లేని వాతా వరణంలో నిత్యం ఆనందంగా గుడుపుతుంటారు. జీవన విధానానికి ఆద ర్శంగా నిలుస్తున్న కామారెడ్డి జిల్లాలోని రాజమ్మతండా వాసు ల జీవన విధానం అందరినీ ఆచరించేలా ఆకట్టు-కుంటు-ంది.


గత 40 ఏళ్లుగా తండాలో కేవలం ఏడుగురు మాత్రమే చనిపోయారు. అందులో ఒకరు గుండెపోటు-తో చనిపోగా.. మిగతావారు 95 ఏళ్లకు పైబడినవారని చెబుతున్నారు. ఆకుకూరలు, మక్క రొట్టె జొన్న రొట్టెలు, సేంద్రియ కూర గాయలు తమ ఆరోగ్యానికి దీర్ఘాయుష్షుకు మూల సూత్రా లుగా వివరించారు. అల్లం కారంతో కూడిన మక్క, జొన్న రొట్టె-లే తమ దీర్ఘాయుష్షుకు మూలకారణాలని వెల్లడించారు. 90 ఏళ్ల సగటు- జీవన విధానం కలిగి ఉన్న రాజమ్మ తండా గంగావత్‌ రాజమ్మ పేరు మీద ఏర్పడింది. ఒకప్పుడు కామారెడ్డి సమితి కోఆప్షన్‌ సభ్యులుగా రాజమ్మ పని చేశారని వారి వారసులు తెలిపారు. రాజమ్మకు తండాలో గుడి కట్టి పూజలు చేస్తున్నారు. రెడ్డిపేట గ్రామ సర్పంచిగా కూడా రాజమ్మ పని చేశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. 50ఏళ్ల క్రితం రెడ్డి పేట నుంచి మొదట వచ్చిన 30 కుటు-ంబాలు గుడిసెలు వేసుకుని వ్యవసాయం ప్రారం భించా యి. ప్రస్తుతం 90 కుటు-ంబాలు.. తండా జనా భా 480. అడవి మధ్యలో పచ్చని పొలాలు గుట్టల నడుమ రాజమ్మ తండావాసుల ఆహ్లా దకర ప్రశాంత జీవనం సాగిస్తున్నా రు. 90 ఏళ్ల దీర్ఘాయు ష్షుతో జీవిస్తున్నారు. ప్రస్తుతం వందేళ్లు జీవించిన గంగావత్‌ చంద్రబాను కామారెడ్డి జిల్లా రామారెడ్డి నుంచి నిజామాబాద్‌ జిల్లా డొనకల్‌ రహదారిలో రాజమ్మ తండా 50 ఏళ్ల క్రితం ఏర్పడింది. రెడ్డిపేట నుంచి భుక్యా, గంగావత్‌ వర్గాల చెందిన 30 కుటు-ంబాలు వలస వచ్చి రాజమ్మ తండాలో స్థిర నివాసం ఏర్పాటు- చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. మొదట్లో గుడిసెలు వేసి జీవనం సాగించారు. తండవాసులు నేడు వ్యవసాయ బోర్లు, అటవీ ఉత్పత్తులతో అడవి మధ్య పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణంలో ఆర్‌సిసి స్లాబు భవనాలలో జీవనం గడుపుతున్నారు. రాజ మ్మ తండా చుట్టూ అడవితో పాటు- మద్ది కుంట గ్రామ శివారు, కోటాల్‌ పల్లి శివారు, రామారెడ్డి శివారు పక్క న రాజమ్మ తడా ఉంటు-ంది. ప్రశాంత, పచ్చని పొలా ల మధ్య 90 ఏళ్ళు బతకడం తం డాలో సహజం, సగటు- 90 ఏళ్ళు బతికేందుకు భోజనం అలవాట్లు-, సంప్ర దాయ అలవాట్లతో జీవిస్తున్నారు.
గంగావత్‌ పూల్యా నాయక్‌కు 90ఏళ్ళు. ఇంకా ఆరోగ్యంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తున్నారు. రోజూ మక్క రొట్టె, జొన్న రొట్టెలు తినడంతో ఆరోగ్యంగా ఉంటామని, సగటున- 90 ఏళ్లు జీవిస్తున్నామని రాజమ్మ తండావాసులు చెప్తున్నారు. కట్టెల పొయ్యిల పైనే వంట చేసుకుంటామని అన్నారు. రాజమ్మ తండాలో టీ-వీలు, ఫోన్లు తప్ప ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడరు. అదేవిధంగా అల్లంవెల్లుల్లి కారంతో మక్క, జొన్న రొట్టెలు రెండు పూటలా ఆహారం తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ మక్క రొట్టెలే తింటామంటున్నారు. రెండేళ్ల క్రితం దునియా మొత్తం కరోనాతో మృత్యువాత పడితే తమ తండాలో కరోనా సోకలేదన్నారు. మంచి వాతావరణంలో అందరం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బతుకుతున్నామన్నారు. చుట్టూ పచ్చని పొలాలు, అడవి గుట్టల మధ్య స్వచ్ఛమైన గాలి వాతావరణం ఉండడంతో రోగాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. జలుబు, జ్వరాలు వస్తే కూడా అల్లం, వెల్లుల్లి ఇతర సంప్రదాయ వైద్యంతోనే నయం చేసుకుంటామన్నారు.
సహజసిద్ధ వాతావరణంలో ఉండడం, ఆకుకూరలు, మక్కరొట్టె భోజనంతో రాజమ్మ తండావాసులకు రోగనిరోధక శక్తి అధికంగా ఉంటు-ందని వారంటున్నారు. ప్రతి ఒక్కరు 90 ఏళ్లు పైబడి బతకడం రాజమ్మ తండాలో ప్రత్యేకం. పచ్చని ప్రకృతి, అడవి మధ్య, పొలాల మధ్య జీవనం సాగించడంతో దీర్ఘాయుష్షుతో ఉంటు-న్నామంటున్నారు. ఆకుకూరలు, సేంద్రియ కూరగాయలు, మక్క రొట్టె, జొన్న రొట్టె తీసుకోవడంతో అధిక కాలం బతుకుతున్నామని అదే ముఖ్య కారణం అని గంగావత్‌ చందర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement