Friday, September 6, 2024

Special Story – ఇక రాజ‌కీయ సిక్స‌ర్లే….

విమర్శల విందు… రాజకీయ పసందు!
క్రీజ్‌లోకి వచ్చిన కేసీఆర్‌
బౌన్సర్‌లతో కాంగ్రెస్‌
అంశాలవారీ పోరు
వెూహరిస్తున్న తీరు
హాట్‌హాట్‌గా అసెంబ్లీ
క్షేత్రస్థాయిలోనూ ఉధతం
కేటీఆర్‌, హరీష్‌లూ సన్నద్ధం
శ్రేణుల్లో సమరోత్సాహం
సాక్ష్యాలతో ఎండగడతా…
అస్త్రశస్త్రాలతో రేవంత్‌ సంసిద్ధం
ప‌దునైన వాగ్ధాటే కేసీఆర్‌ ఆయుధం!

తెలంగాణ రాజకీయాలు మళ్లీ రాజకీయ ఆసక్తిపరులకు పసందైన విందుగా మారనున్నాయి… గత పదేళ్లగా ప్రభుత్వాధినేతగా కేసీఆర్‌ చమక్కులను మాత్రమే అప్పుడప్పుడు ఆస్వాదించారు… అయితే, ఈసారి రెండు దశాబ్దాల క్రితం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల మధ్య నడిచిన వాడివేడి రాజకీయాన్ని, మాటల తూటాలను మరోసారి కేసీఆర్‌, రేవంత్‌ల మధ్య నడిచే అవకాశాన్ని వీక్షించే అవకాశం కలుగుతోందని భావిస్తున్నారు…కేసీఆర్‌ను విపక్ష స్థానంలో కూర్చోబెట్టి కళ్లారా వీక్షించి తన చిరకాల వాంఛ నెరవేర్చుకున్నానని రేవంత్‌ వ్యాఖ్యానించగా, పాలన చేతకాని దద్దమ్మలకు తన పరాక్రమాన్ని రుచి చూపిస్తానని కేసీఆర్‌ స్పష్టం చేసి శ్రేణుల్లో సమరోత్సాహం రగిలించారు… అంశాలవారీగా ఆధారాలతో సహా కేసీఆర్‌ బండారాన్ని బయటపెడతానని రేవంత్‌ అస్త్రశస్త్రాలతో సంసిద్ధం కాగా, కల్లబొల్లి కబుర్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పటాటోపాన్ని అవే అంశాలవారీగా చీల్చి చెండాడుతానని కేసీఆర్‌ వింటినారిని ఎక్కుబెట్టి ఝంకారం చేశారు…

- Advertisement -

న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌, హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:

స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లోకి వచ్చారు… అప్పటివరకూ పరుగులను కట్టడి చేసిన ప్రత్యర్థి బౌలర్ల అసలు సత్తా ఇక బయటపడనుంది… వచ్చీ రా గానే సిక్సర్‌తో ఆ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ తన మూడ్‌ ఏమిటో స్పష్టం చేశా డు. తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉం దని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలకు విపక్ష నేత, భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లి కి హాజరయ్యారు. అంతేనా… ఏకంగా మీడియా పాయింట్‌కు వచ్చి బడ్జెట్‌ను, రేవంత్‌ సర్కార్‌ను చీల్చి చెండాడారు. అసెంబ్లి లో బడ్జెట్‌పై చర్చలో అంశాలవారీగా ఎండ గడతామని స్పష్టం చేశారు. తమ అధినేత కేసీఆర్‌ సభలోకి రావడమే కాకుండా తన వాగ్ధాటితో అదరగొట్టడంతో భారాస ఎమ్మెల్యేలతో పాటు శ్రేణుల్లోనూ రణోత్సాహం పెల్లుబుకుతోంది.

అసెంబ్లిd సమావేశాలు ఇక రంజుగా కొనసాగనున్నాయని అధి కారపక్షంతో పాటు అందరూ అంచనా వేస్తున్నారు. 1999- 2004, 2004-2009 సమావేశాల్లో జరిగినట్టు ఇకపై కూడా అంతకుమించి వాడివేడిగా జరుగుతాయని భావిస్తున్నారు. సవాళ్లను స్వయంగా ఎదుర్కొనేందుకు కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగడంతో ఇక వలసలకు చెక్‌ పడినట్టేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, కేటీఆర్‌, హరీష్‌ల రూపంలో బలంగా ఉన్న ప్రతి పక్షాన్ని ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేక వ్యూహాలతో అధికార పక్షాన్ని తూట్లు పొడిచి అల్లకల్లోలం చేసేందుకు అధినేత కేసీఆర్‌ పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో పథకం గురించి సమగ్ర సమాచారంతో, లోపభూయిష్ట విధానాలను ఏవిధంగా ఉదా హరణలతో సహా ఎండగట్టాలో స్వయంగా రచిస్తున్నట్టు సమాచారం.

ఇక క్షేత్రస్థాయిలో కూడా బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని అధినేత కేసీఆర్‌ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. స్పష్టమైన కార్యా చరణతో క్షేత్రస్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని, కేటీఆర్‌, హరీష్‌లు నాయకత్వంలో శ్రేణులు కదం తొక్కాలని ఆయన ఇప్పటికే పలుసార్లు అంతర్గత సమావేశాల్లో విపులంగా చర్చించారని చెబు తున్నారు ముఖ్యంగా భారాస ప్రవేశపెట్టిన రైతుబంధు అంశంలో అన్న దాతలను సమాయత్త పరచాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. రేవంత్‌ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గణాంకాలతో సహా భారాస ఎంత మేలు చేసిందీ వివరిస్తూ రైతులను ఆందోళనలకు సంసిద్ధం చేయాలని కేసీఆర్‌ నేతలతో భేటీలో చెప్పినట్టు సమాచారం.

తెలంగాణలో 92 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నా రని భారాస అధినేత స్పష్టం చేస్తూ, వారికి ప్రతి ఏటా సకాలంలో రైతు బంధును అందించి ఎంత మేలు చేసిందీ వివరించాలని, ఇందుకు సమగ్ర కార్యాచరణకు రూపకల్పన చేయాలని ఆయన నేతలకు ఉప దేశించారు. రైతుబంధు విషయంలో తామేదో పొరబాట్లు చేసినట్టు కాంగ్రెస్‌ నేతలు నానాయాగీ చేస్తున్నారని, దీన్ని సూటిగా తిప్పి కొట్టాలని ఆయన నేతలకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అలాగే, రైతు బీమా విషయంలోనూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్య మించాలని చెప్పినట్టు సమాచారం. ఎక్కడ తప్పు ఏవిధంగా జరి గిందో వివరాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నానాయాగీ చేస్తోం దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు నేతలు చెబుతున్నారు.

ఇక రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం చెబుతున్న గణాం కాలకు, క్షేత్రస్థాయిలో సమాచారానికి పొంతన ఉండడం లేదని కేసీ ఆర్‌ స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారం తో రేవంత్‌ సర్కార్‌ నిజస్వరూపాన్ని సమాజానికి వెల్లడించాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టు చెబుతున్నారు. నిబంధనల పేరుతో రైతులను దారుణంగా రేవంత్‌ ప్రభుత్వం వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు అసెంబ్లిdలోను, ఇటు క్షేత్రస్థాయిలోనూ పూరి ్తస్థాయిలో పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.

అయితే, ఇటు ప్రభుత్వం కూడా కేసీఆర్‌ సభకు రావడంతో ఒక్క సారిగా అప్రమత్తమైందని సమాచారం. భారాసపై అంశాలవారీగానే తాము కూడా ఎదురుదాడికి సంసిద్ధంగానే ఉన్నామని పాలకపక్షం నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా, సీఎం రేవంత్‌రెడ్డి తన పదునైన విమర్శలతో కేసీఆర్‌ను టార్గెట్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇం దుకు సంబంధించిన డాటాబేస్‌ను ఆయన ఇప్పటికే పూర్తిగా అధ్య యనం చేశారని అంటున్నారు.

ప్రతి ఒక్క అంశంలోనూ కేసీఆర్‌ను సూటిగా ఆధారాలతో సహా సభాముఖంగా కడిగేస్తానన సన్నిహితుల వద్ద రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. భారాస అధినేత కేసీఆర్‌ను ఎట్టకేలకు విపక్ష స్థానంలో కూర్చోబెట్టి కళ్లారా వీక్షించాలన్న తన చిరకాల వాంఛ నెరవేరిందని రేవంత్‌ రెడ్డి ఎంతో ఖుషీగా ఉన్నట్టు సన్నిహితుల సమాచారం.

బడ్జెట్‌ సందర్భంగా మీడియా పాయింట్‌ వద్ద కేసీఆర్‌ చెల రేగిపోయిన విధానాన్ని, ఆయన వాగ్ధాటిని చూశారు కదా! ఇక నా విమర్శనాస్త్రాలని, చీల్చిచెండాడే విధానాన్ని అసెంబ్లి సాక్షిగా చూడండని సమరోత్సాహంతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీంతో ఇటు అసెంబ్లిలోనూ, వెలుపలా కూడా ఇరువురి మధ్య పదునైన విమ ర్శలు, ప్రతివిమర్శనాస్త్రాలు సంధించుకోవడం కనిపిస్తుందని చెబు తున్నారు. ఏదిఏమైనా ఇరువురి పరాక్రమం కచ్చితంగా తెలంగాణకు మేలే చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement