సమస్యలతో సతమతం అవుతున్న ధరణి పోర్టల్‌ని దారికి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నింటికి ఒకే మాడ్యూల్ తీసుకురావాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఒకే మాడ్యూల్లో అన్ని సమస్యలకు పరిష్కారం ఉండాలని ప్లాన్ చేసింది. దీనికోసం సింగిల్ విండో తరహాలో దరఖాస్తుల స్వీకరణను ఏకీకృతం చేయాలని అధికారులు మార్పులు చేశారు. ధరణి పోర్టల్‌లో త్వరలో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఒకే మాడ్యూల్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పుడున్న ఇబ్బడి ముబ్బడి మాడ్యూల్స్ బెడదను నివారించి సులభతరం చేయనుంది. ప్రస్తుతం 33కు పైగా మాడ్యూల్స్ రైతులకు తీవ్ర ఇబ్బందులుగా మారాయని ప్రభుత్వం గుర్తించింది. రానున్న కొత్త విధానంలో సరికొత్త తీరులో గ్రీవెన్స్‌లను ఆన్‌లైన్‌లో తీసుకునే చర్యలకు శ్రీకారం చుడుతోంది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: యాజమాన్య హక్కుల కల్పనలో ధరణి పోర్టల్ కీలకంగా మారంది. అనేక తప్పుల కారణంగా 20లక్షల ఎకరాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక మరో 2.45లక్షల మంది పెండింగ్ సమస్యలనుంచి ఉపశమనం పొందేందుకు వేచిచూస్తున్నారు. పోర్టల్‌లో ఉన్న సాంకేతిక సమస్యలలో ప్రధానంగా 33 రకాలకు పైగా మాడ్యూల్స్ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చింది. అదేవిధంగా అధికారుల వికేంద్రీకరణ, ఆర్జీల పరిష్కారంలో పారదర్శకత, ఆర్జీల అప్‌లోడ్‌లో సులువైన విధానం దిశగా కసరత్తు చేస్తోంది.
దరఖాస్తులకోసం రైతుల ఇబ్బందులు..
రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఇప్పుడు ఆప్షన్లు లేవు. వీటి పరిష్కారానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవస్థలు ఎదురవుతున్నాయి. తాజాగా అన్ని ఫిర్యాదుల ఆర్జీలను మీ సేవలో చేసేందుకు ధరణి పనిచేయడంలేదు. మాడ్యూల్స్ నిలిపివేశారు. కొత్తగా చట్టం లేదంటే మా భూమి వచ్చేంత వరకు ఈ తిప్పలు తప్పేలా లేవని చెబుతున్నారు. టీఎం 1నుంచి టీఎం 35 వరకు ఉన్న మాడ్యూల్స్‌లో ఎక్కువ భాగంగా సేవలకు సంబంధించినవేకాగా, కొన్ని మాత్రమే ఫిర్యాదులకు వీలుగా ఉన్నాయి. టీఎం 33 కింద అన్ని దరఖాస్తులను చేసుకోవచ్చన్న గత ప్రభుత్వ నిర్ణయం ఆచరణలోకి రాలేదు. దీంతో భారీగా తప్పు ఆర్జీలు నమోదయ్యాయి. వీటిని తాజాగా అధికారులు రిజెక్ట్ చేస్తున్నారు. మళ్లి దరఖాస్తులు చేసుకుందామంటే ధరణిలో అవకాశం లేకుండా పోతోంది.
వేరే భూములన్నీ వ్యవసాయ భూములుగానే..
పలు సమస్యలను తొలగించే ఆప్షన్ ధరణి పోర్టల్‌లో అందుబాటులో లేదు. గతంలో కొందరు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా (నాలా) మార్పు చేసుకున్నారు. ఈ భూములకు నాలా ప్రొసీడింగ్స్ కూడా జారీ అయ్యాయి. కానీ కొన్నిచోట్ల అవి వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో సదరు రైతులు, సంస్థలు, పరిశ్రమలు తమ భూముల మారిడ్పి కోసం ధరణిలోని 33 మాడ్యూల్ కింద మిస్సింగ్ సర్వే నంబర్ల కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటు-న్నారు. ఈ దరఖాస్తులను కలెక్టర్ లాగిన్‌లో పరిష్కరించిన తర్వాత కూడా అవి వ్యవసాయ భూములుగానే కనబడుతున్నాయి. కొన్ని భూములకు ఇచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఏజీపీఏ)లు ధరణిలో ప్రాసెస్ కా లేదు. వీటిని ప్రాసెస్ చేసేందుకు పట్టాదారు బయోమెట్రిక్ వివరాలను ధరణి పోర్టల్ అడుగుతోంది.
థర్డ్ పార్టీకి చాన్స్.. ఇదే అసలు ప్రాబ్లమ్
ధరణి పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు అసలు పట్టాదారుకు కాకుండా థర్డ్ పారీల్టు కూడా దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఒక సర్వే నంబర్‌లో థర్డ్ పార్టీలు (పట్టాదారుకు తెలియకుండా) దరఖాస్తు చేసుకుని ఉంటే.. అసలు పట్టాదారు లేదా ఆ సర్వే నంబర్‌లోని మరో పట్టాదారు దరఖాస్తు చేసుకునేందుకు ధరణి అనుమతించడం లేదు. ఇప్పటికే దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెబుతోంది. ఈ విషయంలో థర్డ్ పార్టీలను నియంత్రించే పద్ధతి తీసుకురావాలి. ధరణి పోర్టల్‌లో తాజా పహాణీలు అందుబాటు-లో లేవు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్ల లాగిన్‌లలో కొత్త పహాణీలు అందుబాటు-లో ఉంచాలి.
ఒకసారి తప్పు ఎంట్రీ అయితే సవరించుకునే చాన్స్ లేదు..
కొందరు రైతులు తమ భూములను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. అలాంటి మారిగ్టేజ్ భూములకు డూప్లికేట్ పాసు పుస్తకాలు తీసుకుని సేల్‌డీడ్‌లు చేసుకునే వెసులుబాటును తొలగించాలి. ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులకు సంబంధించిన వివరాలను పొరపాటుగా నమోదు చేస్తే, దరఖాస్తు పూర్తయిన తర్వాత మళ్లీ ఆ వివరాలను సవరించుకునే అవకాశం లేదు. వారసత్వ హక్కులు (పౌతీ) కల్పించే క్రమంలో ఈ-పాసు పుస్తకాలు వస్తున్నాయి కానీ, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు పౌతీ ప్రొసీడింగ్స్ అడుగుతున్నారు.
క్రయ విక్రయ లావాదేవీల సంగతేంటి..
ధరణి పోర్టల్‌లో ఆధునీకరించిన లేదా సవరించిన వివరాలు అందుబాటులో లేవు. సదరు రైతుకు సంబంధించిన అప్‌డేటెడ్ సమాచారం (సర్వే నంబర్, ఖాతా, విస్తీర్ణం లాంటి వివరాలు) అందుబాటులో ఉంచాలి. గతంలో ఆర్డీవోలు జారీ చేసిన నాలా ప్రొసీడింగ్స్‌ను అప్‌డేట్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. గతంలో జారీ చేసిన 13-బి, 38ఈ సర్టిఫికెట్ల అప్‌డేషన్‌కు కూడా ఆప్షన్ తీసుకురావాలి. క్రయ విక్రయ లావాదేవీల కోసం బుక్ చేసిన స్లాట్‌లను అనివార్య పరిస్థితుల్లో రద్దువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో అనేక మార్పులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.