Sunday, December 29, 2024

TG Assembly : 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఎల్లుండి (ఈ నెల 30న) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం జరగనున్నది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కు శాసనసభ నివాళులు అర్పించనుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించారు.

దీంతో ఈనెల 30వ తేదీ జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీని వాయిదా వేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి కేబినెట్ భేటీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement