Saturday, January 18, 2025

Delhi | పసుపు బోర్డుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి..

  • కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన‌ ఎంపీ ధర్మపురి

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ ) : ఇటీవల నిజామాబాద్ జిల్లాకు కేటాయించిన జాతీయ పసుపు బోర్డుకు ఫిబ్రవరి 1న జరిగే కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాలయంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను వివరించారు. పసుపు రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రారంభించడం పట్ల పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా పసుపు రైతుల తరపున కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement