Saturday, September 21, 2024

TG: టూరిజంపై ప్రత్యేక దృష్టి… మంత్రి జూపల్లి

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : దేశంలో, రాష్ట్రంలో అనేక గొప్ప గొప్ప కట్టడాలు, దేవాలయాలు, పర్యటక ప్రాంతాలు వున్నాయని రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ప్రొహబిషన్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యలతో కలిసి కొడవటంచ ఆలయంలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలకు, ఆలయ అభివృద్ది పనులకు రూ.12 కోట్ల 15లక్షలతో పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక అద్భుతమైన కట్టడాలు, కళారూపాలు వున్నాయని, సాంస్కృతిక సంపద, శిల్పకళా ఉందని తరించాలని మంత్రి కోరారు.

నెలకు ఒక రోజు కొత్త ప్రాంతాలను సందర్శంచాలని, దీంతో ప్రశాంతత దొరుకుతుందని సూచించారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిత్యం 500మందికి పైగా దర్శించుకుంటున్నారని భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలతో పాటు హోటల్ ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా.. మంత్రి జూపల్లి సానుకూలంగా స్పందించి వారం రోజుల్లో ఎస్టిమేషన్ తయారు చేయించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. భూపాలపల్లిలో అనేక టూరిజం ప్రాంతాలు ఉన్నాయని, టూరిజం శాఖ మంత్రి దృష్టి సారించి నిధులు కేటాయించాలని కోరారు. తన ఎంపీ నిధులు కూడా కేటాయిస్తానని తెలిపారు. అనంతరం తిరుమలగిరి శివారు బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని గుట్టను పరిశీలించారు. అక్కడినుండి పాండవులు గుట్టలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమోత్సవంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క తో కలిసి పాండవులగుట్ట వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ , ఏవిని తిలకించారు.

- Advertisement -


పాండవులగుట్ట అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత.. మంత్రి జూపల్లి
భూపాలపల్లి జిల్లాలో పాండవులు అజ్ఞాత వాసం చేసిన చారిత్రాత్మకత కలిగిన ప్రాంతం పాండవుల గుట్టలు అని, ఆదిమానవులు వేసిన చిత్రాలు నేటికీ ఈ గుహలో ఉన్నాయని, ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాల్సిందిగా మంత్రిని కోరారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టవలసి ఉందన్నారు.

సాధ్యాసాధ్యాలను పరిశీలించి పర్యాటకులకు శాశ్వత, తాత్కాలిక మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు అధికారులతో ఎస్టీమెంట్ వేయించడం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ అటవీశాఖ మంత్రులతో చర్చించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, వివిధ శాఖల చైర్మన్లు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ జె. వసంత, జిల్లా అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement