Tuesday, November 26, 2024

Speaker Pocharam – రైతన్నకు భరోసా..వర్షాభావ పరిస్థితుల్లోను సాగునీరు అందిస్తాం ..

నిజ‌మాబాద్ – వానాకాలం లో వర్షభావ పరిస్థితులు ఏర్పడితే పంటలకు సరిపడా సాగు నీళ్ళును అందించి రైతులను ఆదుకుంటామని స్పీకర్ పోచారం అన్నారు. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి వానకాలం పంటల సాగు నీళ్లను ఆయన విడుదల చేశారు.మొదటి విడతగా 1500 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేశామని అలీ సాగర్ వరకు గల ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకొని వానాకాలం పంటలు వేసుకోవాలని సూచించారు.ఈ సందర్బంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వానాకాలం పంటల సాగు కోసం రాష్ట్రం లోనే తొలి నీటి విడుదలను నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి విడుదల చేస్తున్నామని అన్నారు.

సాగు నీళ్ళ విడుదల నిమిత్తం తాము సీఎం కెసిఆర్ ను అడగగానే స్పందించి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.గతం లో ఈ పరిస్తితి ఉండేది కాదని నీటి విడుదల కోసం సీఎం చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి ఉండేదని చెప్పుకొచ్చారు.ఆత్యాద్మిక చింతన గల సీఎం కెసిఆర్ ఆలోచనలతో రాష్ట్రం లో అన్ని పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.వానాకాలం సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు 10 టీఎంసీ ల నీళ్ళు అవసరం పడతాయని ప్రస్తుతం 5 టీఎంసీ లు మాత్రమే ఉన్నాయని,అవసరం అయితే మిగతా నీళ్లను కొండ పోచమ్మ సాగర్, సింగూరు నుండి తెప్పిస్తామని అన్నారు.రైతులు సకాలంలో పంటలు సాగు కు సమాయత్తం కావాలన్నారు

.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎంపీ బిబి పాటిల్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్,ఆర్డీవో రాజ గౌడ్,కామారెడ్డి సి ఈ శ్రీనివాస్,బాన్స్ వాడ ఎస్ ఈ ,ఈ ఈ సోలమన్, తహశీల్దార్ నారాయణ ,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement