Friday, November 22, 2024

నా జీవం ఉన్నంత‌ వరకు ప్రజల‌కు సేవ చేస్తా….. స్పీక‌ర్ పోచారం

బాన్సువాడ , మే 6 ప్రభ న్యూస్ – నా జీవం ఉన్నంత వరకు బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తానని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లోని స్వగృహంలో, తిమ్మాపూర్ వద్ద కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, డబల్ బెడ్ రూమ్ పథకాలపై మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బాన్సువాడ నియోజకవర్గం లోని ప్రజాసేవయే నా ఆశయం ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నిరుపేద బతుకుల్లో వెలుగు నింపడమే నా ఆశయం నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రతినిత్యం ఏ కష్టం వచ్చినా నా కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందించడమే నా ఆశయం అంటూ ఆయన అన్నారు. శాసనసభాపతి అయిన బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై వారి కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చేందుకు కృషి చేస్తున్నానని ఆయన అన్నారు.

ప్రజలు నిరుపేద వర్గాల ఉండటానికి ఇల్లు లేక అద్దె భవనాల్లో ఉండి కష్టాల్లో ఉన్న వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గం 11000 వేలు రెండు పడకల గదులు ఇల్లు మంజూరు అయ్యాయని, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం సబ్సిడీ కింద ఇంత పెద్ద మొత్తంలో మంజూరు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 11 ఇండ్లలో కాంట్రాక్టర్ ద్వారా 3000 కట్టిస్తే మిగతా 8 ఇళ్లను లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకున్నారని ఆయన అన్నారు. విడతల వారీగా లబ్ధిదారులకు ఇంటి బిల్లులు చెల్లించడం జరుగుతుంది ఆయన పేర్కొన్నారు. త్వరలోనే మూడు లక్షల రూపాయల ఇంటి పథకం అమల్లోకి వస్తుందని నియోజకవర్గంలోని నిరుపేద వర్గాల ప్రజలకు ఇల్లు లేని లబ్ధిదారులకు అందరికీ మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

బాన్స్వాడ మున్సిపాలిటీ రూరల్ మండలానికి సంబంధించిన 75 మంది కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 2017 సంవత్సరంలో ప్రారంభించిన కళ్యాణ్ లక్ష్మీ పథకం షాది ముబారక్ పథకం మొదటగా 51000 ప్రారంభమై ప్రస్తుతం లక్ష 116 ఇస్తున్నామని ఆయన అన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్తం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో పడ్డా లక్షల మందికి నగదు సాయం అందించడం ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేనని ఆయన అన్నారు.
పట్టణ లక్షల మందికి నగదు సాయం కింద ఎందుకు 10,000 కోట్లు ఖర్చు అయినాయని ఆయన అన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలులో లేవని ఆయన అన్నారు. ఆడబిడ్డ కొండగా రాష్ట్ర ముఖ్యమంత్రి పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రమంతా ఒక కుటుంబం లాగా భావించి ప్రతి పేదవాడికి ఏదో పథకం పేరిట ప్రతి ఇంటింటా సంక్షేమ ఫలాలు అందించిన ఆరాధ్య దేవుడని ఆయన అన్నారు. పేదల కుటుంబాలు తక్కువ ఖర్చుతో వివాహాలు చేసుకోవడానికి బాన్సువాడ నియోజకవర్గంలో 50 కోట్లతో 80 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామని వీటిలో రోజు అద్దే కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రజలు చెల్లించాలని, వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్, కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ ఎంపీపీ నీరజ వెంకటరామిరెడ్డి, బారాస మండల అధ్యక్షులు మోహన్ నాయక్ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు ,పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement