Wednesday, November 20, 2024

South Korea Tour – రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను సందర్శించిన తెలంగాణ మంత్రుల బృందం

హైదరాబాద్‌: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ, మూసీ రివర్‌ఫ్రంట్‌ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను ఈ బృందం సందర్శించింది.

ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ సియోల్‌, హైదరాబాద్‌ నగర నమూనాలు ఒకేలా ఉంటాయని తెలిపారు. సియోల్‌లో సుమారు 10వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరించి నగరంలోని నాలుగు వైపులకు తరలిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో దాదాపు 8వేల మెట్రిక్‌ టన్నులు సేకరించి ఒకే వైపునకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరం చుట్టూ నాలుగు ప్రదేశాలను గుర్తించినట్లు వివరించారు. నగరంలోని చెత్తను నాలుగు వైపులకు పంపించడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు.

మాపో ప్లాంట్‌లో..

- Advertisement -

మాపో ప్లాంట్‌లో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల రీసైక్లింగ్‌కు వేస్ట్‌ టు ఎనర్జీ టెక్నాలజీని సియోల్‌ నగరపాలక సంస్థ వాడుతోంది. పర్యావరణంపై దుష్ర్పభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుంచి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్‌ను నిర్మించేందుకు సియోల్ నగర పాలక సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాపో ప్లాంట్‌ పనితీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లింది.

సీయోల్ లో నదుల ప్రక్షాళన పై

చెంగిచియాన్ నది సందర్శన,రివర్ ఫ్రంట్ అధికారులతో చర్చలు,చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించారు. పర్యావరణం పై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగం లోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఉంది. మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతుంది సియోల్ నగర పాలక్ సంస్థ. ఇటువంటివి నగరం లో నాలుగు ప్లాంట్లను నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశం పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య అధికారుల బృందం పరిశీలించారు.

దీనిపై చామల కిరణ్ కుమార్ రెడ్డి , గతంలో ఈ సీయోల్ నగరం నడిబొడ్డు నుండి ప్రవహించే చెంగిచియాన్ నది కూడా మన హైదరాబాద్ నుండి ప్రవహించే మూసి నది లాగానే మురికిమయంగా ఉండేది. సియోల్ నగర పాలక సంస్థ ముందుకు వచ్చి ఈ నదిని ప్రక్షాళన చేసి పునరుజీవం పోశారు. నేడు అత్యంత సుందరమైన నగరంగా సీయోల్ మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్, తెలంగాణ ప్రజల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూసి నది ప్రక్షాళన చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూసి నదికి పునర్జీవం పోస్తే హైదరాబాద్ మహానగరం కూడా సియోల్ నగరం గా అందంగా తయారవుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement