Thursday, November 21, 2024

దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. సరుకు రవాణాలో 50% వృద్ధి

దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో కోవిడ్‌`19 మహమ్మారితో అనేక సవాళ్లు ఎదురైనా ఈ ఆర్థిక సంవత్సరంలో నెల నెలా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నది. 2021 జులైలో జోన్‌ నుండి 9.528 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా అయ్యింది. గత సంవత్సరం జులై 2020 కాలంలో జరిగిన 6.341 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌తో పోలిస్తే ఇది 50% అధికం.

దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో ప్రధానమైన బొగ్గు లోడిరగ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఊపందుకొని జులై 2021లో 4.139 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌ను నమోదు చేసింది. ఇది 2020 జులై లోడిరగ్‌ కంటే 66% అధికం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రధాన సిమెంట్‌ ప్లాంట్లు ఉండడంతో సరుకు లోడిరగ్‌లో సిమెంట్‌ మరో ప్రధాన వనరుగా ఉంది. 2021 జులై కాలంలో సిమెంట్‌ లోడిరగ్‌ 2.811 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌తో 2020 జులైతో పోలిస్తే 53% వృద్ధి సాధించింది. అదే విధంగా, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు మరియు ఎరువుల లోడిరగ్‌కు అనేక చర్యలు తీసుకుంది. దీంతో 0.794 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు, 0.735 మిలియన్‌ టన్నుల ఎరువుల లోడిరగ్‌ నమోదు అయ్యింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జులై మొదటి నాలుగు నెలల కాలంలో సరుకు రవాణాలో జోన్‌ దూసుకుపోయింది. జోన్‌లో 38.164 మిలియన్‌ టన్నుల సరుకు లోడిరగ్‌ జరిగింది. ఇది గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 54% అధికం. ఈ సరుకు లోడిరగ్‌లో 18.455 మిలియన్‌ టన్నుల బొగ్గు, 10.63 మిలియన్‌ టన్నుల సిమెంట్‌, 2.56 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు, 2.038 మిలియన్‌ టన్నుల ఎరువులు మొదలైనవి ఉన్నాయి.

జోన్‌ సరుకు రవాణాకు సంబంధించి గూడ్సు రైళ్ల సగటు వేగం పెంపు, వ్యాగన్లను అందుబాటులో ఉంచడం, పాత ట్రాఫిక్‌ పునరుద్ధరణ, నూతనంగా సరుకు వినియోగదారులను ఆకర్షించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సరుకు రవాణా అభివృద్ధికి ప్రధాన కార్యాలయంతోపాటు డివిజినల్‌ స్థాయిలో కూడా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్లు నిరంతరం కృషి చేస్తూ తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు నిర్వహించిన సమావేశాలు వృద్ధికి తోడ్పడినాయి.

ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి సరుకు రవాణాలో అభివృద్ధి సాధించడంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సంతోషం వ్యక్తం చేశారు. సరుకు వినియోగదారులకు ఎప్పుటికప్పుడు అందుబాటులో ఉండాలని జనరల్‌ మేనేజర్‌ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. దీంతో వినియోగదారులకు ఏవేనీ సమస్యలుంటే వాటిని  వెంటనే పరిష్కరించవచ్చని ఆయన అన్నారు. సరుకు లోడిరగ్‌లో అన్ని రంగాలకు రైల్వే నిరంతరం తోడ్పాటు అందిస్తుందని, దీంతో వినియోగదారులకు సురక్షితమైన, ఆర్థిక ప్రయోజనంతో వేగవంతంగా సరుకు రవాణా అవుతుందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement