Thursday, October 3, 2024

Sorry – సమంత.. క్షమించు: కొండా సురేఖ

హైదరాబాద్ – మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న వేళ.. ఆమె ఓ మెట్టు దిగొచ్చారు. అక్కినేని, సమంత కుటుంబానికి బాధించడం తన ఉద్దేశం కాదని ఆమె అన్నారు. ఈ మేరకు సమంత ఎక్స్‌ పోస్ట్‌కు మంత్రి రిప్లై ఇచ్చారు. సినీ రంగంలో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శమన్నారు.

మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బ తీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నా. క్షమించండి’ అంటూ సమంతకు ఎక్స్‌లో రీపోస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement