Friday, November 22, 2024

TS: త్వ‌ర‌లో 25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ని.. కేసీఆర్ అహంకార‌మే బీఆర్ఎస్ దుస్థితికి కార‌ణ‌మ‌ని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త‌మ‌ ప్రభుత్వంపై బురదజల్లడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణలో నీటి వ్యవస్థను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోవడం దురదృష్టమన్నారు.

తాము రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. దొంగ పాసుపోర్టులు అమ్మి తాము రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెడతారని చెప్పారు. ఈ కరువు తాము తెచ్చింది కాదని.. కేసీఆర్ తెచ్చిందే అన్నారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకుపోతుంటే కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఎవరెన్ని కుట్రలు చేసినా ఉపయోగం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ కి కర్రు కాల్చి వాత పెడతారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement