కరోనా కష్ట కాలంలో ఎందరికో సాయం చేసి దేవుడిగా మారాడు నటుడు సోనూసూద్. లాక్ డౌన్ సమయంలో నిరుపేదలకు సాయం చేస్తూ రియల్ హీరోగా మారాడు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేయడం, ఇతర అవసరమైన మందులు, పరికరాలను అందజేస్తున్నారు. అడిగిన వారికి వెంటనే సాయం అందిస్తున్నారు. జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇటీవలే తెలిపాడు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోనూ సూద్ కు అభిమానులు పెరిగారు. తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి సోనూసూద్ పేరు పెట్టాడు. సోసూ నిర్వహిస్తున్న ట్రస్ట్ కు విరాళంగా అందించాలనే ఉద్దేశంతోనే ఆయన పేరు పెట్టారు. అయితే, ఈ విషయం సోనూసూద్ వరకు వెళ్లింది. దీనిపై ట్విట్టర్ లో ఆయన స్పందించారు. తాను శాఖాహారిని.. అటువంటిది తన పేరు మటన్ షాపు? అని చమత్కరించాడు. శాఖాహారం తెరవడానికి తాను అతనికి సహాయం చేయగలనా? అంటూ సోనూ ట్వీట్ చేశాడు.